ఇకపై రైళ్లలో ఫుడ్ డెలివరీ సేవలు.. స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ కీలక ఒప్పందం
- బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడలకు డెలివరీ సర్వీస్
- భోజనాన్ని వేడిగా, తాజాగా ఉంచడానికి ఇన్సులేట్ స్విగ్గీ బ్యాగ్‌లలో ప్యాకింగ్
- ఐఆర్‌సీటీసీ యాప్‌లో పీఎన్ఆర్‌ని వినియోగించి ఆర్డర్ చేయాలి
రైళ్లలో ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో తమ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ మంగళవారం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదట బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఆహారాన్ని డెలివరీ చేయనుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ సేవ దేశవ్యాప్తంగా 59 నగరాల స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉందని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది.
"రాష్ట్రాలు, జిల్లాల మీదుగా ప్రయాణించే ఈ రైలు ప్రయాణాల సమయంలో దేశంలోని వివిధ రకాల భోజనాన్ని ఆర్డర్ చేసే అవకాశం ఉంటే, అది ఈ ప్రయాణ అనుభవాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది." అని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు.
ఇక స్విగ్గీ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన ఆహార సేవలను పొందడానికి ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ యాప్‌లో పీఎన్ఆర్‌ని వినియోగించాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ డెలివరీ కోసం ప్రాధాన్య స్టేషన్‌ను ఎంచుకోవాలి. ఇక యాప్‌లోని రెస్టారెంట్‌ల జాబితా నుంచి మీరు కొరుకునే స్టేషన్‌కు ఫుడ్ డెలివరీ చేసే రెస్టారెంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
కాగా, భోజనాన్ని వేడిగా, తాజాగా ఉంచడానికి ప్రయాణికులకు పంపిణీ చేసే ఆహారాన్ని ఇన్సులేట్ చేయబడిన స్విగ్గీ బ్యాగ్‌లలో ప్యాక్ చేస్తామని ఈ సందర్భంగా కంపెనీ తెలియజేసింది. స్విగ్గీ డెలివరీ భాగస్వామి డెలివరీకి కొన్ని నిమిషాల ముందు ఎంచుకున్న ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుని, కస్టమర్‌కు ఆహారాన్ని అందజేస్తారని తెలిపింది.
"స్విగ్గీతో ఈ భాగస్వామ్యం మా ప్రయాణికులకు మరింత సౌలభ్యం, వివిధ రకాల ఆహారాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. తద్వారా వారి ప్రయాణాలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది" అని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు.