మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్... పెండింగ్‌లో నాగర్‌కర్నూల్

  • మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేసిన బీఆర్ఎస్
  • ముఖ్య నాయకులతో చర్చించాక నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి
  • పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయవచ్చునని ప్రచారం
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ ఖరారు చేసింది. నిన్న నాలుగు లోక్ సభ స్థానాలకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మహబూబ్ నగర్‌కు మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు కేసీఆర్ ఖరారు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి డీకే అరుణని 77వేల పై చిలుకు ఓట్లతో ఓడించారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఆయనకే అవకాశం ఇచ్చారు.

కేసీఆర్ ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.

కాగా పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. నిన్న నాలుగు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి అభ్య‌ర్థిగా కొప్పుల ఈశ్వ‌ర్, ఖ‌మ్మం అభ్య‌ర్థిగా నామా నాగేశ్వ‌ర రావు, మ‌హబూబాబాద్ అభ్య‌ర్థిగా మాలోత్ క‌విత పేర్ల‌ను ప్రకటించారు.


More Telugu News