పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు
- పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుపార్టీల అధ్యక్షుల వెల్లడి
- త్వరలో పొత్తుకు సంబంధించి విధివిధానాల ఖరారు
- తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుపార్టీల అధ్యక్షులు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్‌లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు.
ఇరువురి మధ్య లోక్ సభ ఎన్నికలు, పొత్తుల అంశంపై చర్చ జరిగింది. పొత్తుతో ముందుకు సాగాలని ఇరుపార్టీల అధ్యక్షులు నిర్ణయించారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో ముందుకు సాగితే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉండే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ ఉండవచ్చు.