సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • లోక్ సభ ఎన్నికలకు ముందు కలవడంతో ప్రాధాన్యత
  • వరుసగా మూడుసార్లు చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య
బీఆర్ఎస్ నేత, చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పలువురు నేతలు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.


More Telugu News