మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
- ప్రాణహాని ఉందని, ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్‌లను కేటాయించాలని కోరిన శ్రీనివాస్ గౌడ్
- ప్రతి ఒక్కరికీ ఇలా కేటాయించడం సాధ్యం కాదన్న హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు
- తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా
తనకు 4+4 గన్‌మెన్‌లను కేటాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రతి ఒక్కరికీ ఇలా కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్‌లను కేటాయించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం... శ్రీనివాస్ గౌడ్‌కు గన్‌మెన్లు అవసరమా? కాదా? తెలపాలని డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.