బాలనటి నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అవంతిక
- తెలుగులో పలు హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించిన అవంతిక
- ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ
- భారతీయులు కూడా హాలీవుడ్ లో రాణిస్తున్నారని వెల్లడి
- హాలీవుడ్ లో చాన్సుల కోసం యుద్ధం చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యలు
బాలనటిగా బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలలో తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు. నాటి బాలనటి ఇప్పుడు యువ తారగా హాలీవుడ్ స్థాయికి ఎదగడం విశేషం. ప్రస్తుతం అక్కడ పలు ప్రాజెక్టులతో అవంతిక బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
మన దేశ నటులు హాలీవుడ్ లో కూడా రాణిస్తుండడం సంతోషదాయకం అని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం అని అవంతిక అభిప్రాయపడ్డారు. ఒక్క చాన్స్ దక్కించుకోవాలంటే ఓ యుద్ధం చేసినంత పనవుతుందని అన్నారు. మన చిత్ర పరిశ్రమతో పోల్చితే హాలీవుడ్ ఇండస్ట్రీ భిన్నంగా ఉంటుందని, మన టాలెంట్ ను నిరూపించుకోవడమే కాదు, బంధుప్రీతి, వర్ణవివక్ష వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అవంతిక వివరించారు.
తాను బాలనటిగా తెలుగులో నటించిన సమయంలో సమంత, కాజల్ తనను ఎంతో బాగా చూసుకున్నారని, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్న సమంతను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని వెల్లడించారు.