కంటతడి పెట్టుకున్న మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య

  • మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సొరేన్
  • భర్తను తలుచుకుని భావోద్వేగానికి గురైన కల్పన
  • ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నానని ప్రకటన
మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను తలుచుకుని ఆయన భార్య కల్పన కన్నీటిపర్యంతం అయ్యారు. రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించడానికి ముందు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడిని తలుచుకుని మా మామగారు శిబు సొరేన్, అత్తగారు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. తన కన్నీటిని అదుపు చేసుకోవాలని తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన బలం మీరే అంటూ జేఎంఎం శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నానని కల్పన చెప్పారు. ఝార్ఖండ్ ప్రజల కోరిక మేరకే తాను ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన భర్త హేమంత్ సొరేన్ తిరిగి వచ్చేంత వరకు ఆయన ఆలోచనల మేరకు పని చేస్తానని, ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సొరేన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.


More Telugu News