నీతో నీ యుద్ధం శివమ్ .. 'గామి' నుంచి శంకర్ మహదేవన్ సాంగ్!
- విష్వక్సేన్ హీరోగా నటించిన 'గామి'
- హిమాలయాల నేపథ్యంలో నడిచే కథ
- దర్శకుడిగా విద్యాధర్ పరిచయం
- ఈ నెల 8వ తేదీన సినిమా విడుదల
విష్వక్సేన్ కథానాయకుడిగా విద్యాధర్ దర్శకత్వంలో 'గామి' సినిమా రూపొందింది. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
'నీలోని యుద్ధం శివమ్ .. నీతో నీ యుద్ధం శివమ్ .. నీకై నీ యుద్ధం శివమ్' అంటూ ఈ పాట సాగుతోంది. 'నీలో నిను వెదికేది .. నీతో నిను కలిపేది' అంటూ తేలికైన పదాలతో .. లోతైన అర్థాలతో శ్రీమణి చేసిన ప్రయోగాలు బాగున్నాయి. నరేశ్ కుమార్ సమకూర్చిన బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు.
ఈ సినిమాలో కథానాయకుడు తన సమస్యకి ఒక పరిష్కారం కోసం హిమాలయాలకు బయల్దేరతాడు. తాను అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోకపోతే, ఇక ఎప్పటికీ తాను ఆ సమస్య నుంచి బయటపడలేడు. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.