ఇదేనా జగన్... నీ మార్కు?: చంద్రబాబు
- పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభ
- హాజరైన చంద్రబాబు
- రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని వెల్లడి
- టీడీపీ పోల్చుకోవడానికి వైసీపీకి ఏముందని వ్యాఖ్యలు
ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని పేర్కొన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీతో వైసీపీకి పోలికే లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి మరొక్కసారి చెబుతున్నా... ఏంచేశారని మీరు టీడీపీతో పోల్చుకుంటారు? అని ప్రశ్నించారు.
"జగన్ మార్కు అంట... బాబాయ్ హత్య నీ మార్కు! రక్త చరిత్ర... నీ మార్కు! సొంత చెల్లి పుట్టుకపై నీచపు ప్రచారం చేయడం నీ మార్కు! అమ్మను గెంటేయడం నీ మార్కు!" అని విమర్శించారు.
"బాబాయ్ ని చంపి గుండెపోటు ఉన్నారు... పనికిమాలిన సాక్షి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది... ఆ రోజు ఆ టీవీ చానల్ లో వచ్చిందా, లేదా? ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారా, లేదా? నాకు తెలియకముందే గొడ్డలిపోటు అన్నారు... ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్నా? అని చెల్లి అడుగుతోంది.
దీనిపై సీబీఐ విచారణ కావాలన్నావా, లేదా? ఆ తర్వాత మళ్లీ సీబీఐ వద్దని నాటకాలు ఆడావా, లేదా? సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టావా, లేదా?
సీబీఐ విచారణ వేయమని వాళ్ల చెల్లెలే అడిగింది. అందుకు నాకేమీ బాధ లేదు... 11 కేసులు ఉన్నాయి, ఇది కూడా వేస్తే 12వ కేసు అవుతుంది... అవినాశ్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతాడు కాబట్టి నేను విచారణ వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు?" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.