టెట్, టీఆర్టీ షెడ్యూల్ మార్చండి: ఏపీ హైకోర్టు
- రెండు పరీక్షల మధ్య నాలుగు వారాల సమయం ఉండాలన్న హైకోర్టు
- 2018లో రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇచ్చారని వ్యాఖ్య
- ఇప్పుడు హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఉందని అభ్యంతరం
ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రాత పరీక్ష తర్వాత విడుదల చేసే కీ పై అభ్యంతరాల స్వీకరణకు కూడా సమయం ఇవ్వాలని పేర్కొంది. 2018లో జరిగిన టెట్, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని... అయితే, ఇప్పుడు మాత్రం హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టెట్ తర్వాత టీఆర్టీకి రెడీ కావడానికి తగినంత సమయం లేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ రాశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు షెడ్యూల్ మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.