ఆ విషయంలో శంకర్ తరువాత ప్రశాంత్ నీల్: బాబీ సింహా
- కమల్ హాసన్ కి సినిమానే ప్రపంచమన్న బాబీసింహా
- టెక్నాలజీ పై ఆయనకి గొప్ప అవహగాహన ఉందని వెల్లడి
- ఆయన సినిమా కోసమే పుట్టాడని వ్యాఖ్య
- ఆర్టిస్టుల పట్ల ప్రశాంత్ నీల్ కి ఎంతో గౌరవం ఉందని వివరణ
బాబీ సింహా .. ఒక వైపున వరుస తమిళ సినిమాలు చేస్తూనే, మరో వైపున ఇతర భాషా చిత్రాలలోను నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా ముఖ్యమైన పాత్రలను కూడా చేస్తూ వెళుతున్నాడు. 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. 'రజనీకాంత్ .. కమల్ .. చిరంజీవి .. వీరికి బదులుగా మరొకరిని చెప్పలేం" అని అన్నాడు.
"కమల్ గారి విషయానికి వస్తే, ఆయన కళ్లు .. నటన నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. స్క్రిప్ట్ పై మాత్రమే కాదు, టెక్నాలజీ పై కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ లపై ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఆయన నాలెడ్జ్ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన సినిమా కోసమే పుట్టాడు అనే విషయం నాకు అర్థమైంది" అని చెప్పాడు.
" సాధారణంగా స్టార్ డైరెక్టర్స్ .. ఆర్టిస్టులపై కోప్పడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆర్టిస్ట్ అనుకున్నట్టుగా చేయకపోతే, దగ్గరికి వెళ్లి అతనికి మాత్రమే చెప్పడం మనం శంకర్ గారిలో చూస్తాం. అలా నేను చూసిన మరో దర్శకుడే ప్రశాంత్ నీల్. చాలా కూల్ గా ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఆర్టిస్టులను అంతగా గౌరవించడం ఆయన గొప్పతనం" అని అన్నాడు.