ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలే.. సచివాలయం అనేది పదెకరాల ఆస్తి మాత్రమే: కొడాలి నాని

  • సెక్రటేరియట్ ను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టడంపై టీడీపీ విమర్శలు
  • ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలనేది రాజ్యాంగంలో ఉందా అని కొడాలి నాని ప్రశ్న
  • చంద్రబాబు చిల్లర నాయకుడని విమర్శ
ఏపీ సెక్రటేరియట్ ను జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెడ్డడం సాధారణ విషయమేనని చెప్పారు. సచివాలయం అనేది కేవలం పదెకరాల ఆస్తి మాత్రమేనని అన్నారు. ఈ ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక చిల్లర నాయకుడదని... ఆయన చేసేదే సంసారం అని చెప్పుకుంటాడని విమర్శించారు. రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే... అందులో చంద్రబాబు చేసినవే రూ. 2.50 లక్షల కోట్లు అని అన్నారు.


More Telugu News