నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: అనిల్ కుమార్ యాదవ్

  • నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేటకు బదిలీ అయిన అనిల్ కుమార్
  • ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్న వైనం
  • అనిల్ కుమార్ పై చంద్రబాబు సెటైర్లు
  • చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్ విసిరిన అనిల్ 
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం... నరసరావుపేట లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచేపల్లి సభలో అనిల్ కుమార్ పై సెటైర్లు వేశారు. 

ఈ నేపథ్యంలో, అనిల్ కుమార్ యాదవ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేటలో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పౌరుషాల పల్నాడు గడ్డపై నుంచి చెబుతున్నానని స్పష్టం చేశారు. నా సవాల్ ను నీ కొడుకు చేత స్వీకరింపజేసే దమ్ముందా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 

నేను రెండు సార్లు ఎమ్మెల్యేని, మంత్రిని... నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు... పల్నాడు గడ్డపై మూతి మీద మీసం తిప్పి చెబుతున్నా... రా చూసుకుందాం అంటూ అనిల్ కుమార్ సవాల్ విసిరారు. 

నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం నీ రక్తంలో ఉంటే నా సవాల్ ను స్వీకరించు... నీకు చేతకాకపోతే నీ కొడుకును నా సవాల్ ను స్వీకరించమని చెప్పు అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.


More Telugu News