ఆ కాలం వేరు .. ఆ నటుల తీరు వేరు: నటుడు నారాయణరావు
- అప్పట్లో చెన్నైలో షూటింగ్స్ జరిగేవన్న నారాయణరావు
- అందరూ కలిసి భోజనం చేసేవారని వెల్లడి
- అందరి మధ్య ఆత్మీయత కనిపించేదని వివరణ
- ఇప్పుడు ఎవరి దారి వారిదేనని వ్యాఖ్య
నారాయణరావు .. బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన నటుడు. 150కి పైగా సినిమాలలో ఆయన నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "తమిళంలో రజనీకాంత్ .. కమల్ తోను, తెలుగులో చిరంజీవితో కలిసి నేను చాలా సినిమాలలో నటించాను. చిరంజీవికి సంబంధించిన చాలా సినిమాల స్కిప్ట్ వర్క్ లో నేను పాల్గొంటూ ఉండేవాడిని" అని అన్నారు.
"అప్పట్లో 6 భాషలకి సంబంధించిన షూటింగ్స్ చెన్నైలో జరుగుతూ ఉండేవి. అన్ని ఫ్లోర్స్ లో ఉండే ఆర్టిస్టులంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్లం. అంతస్తులు ... హోదాలకు సంబంధించిన వాతావరణం అక్కడ కనిపించేదే కాదు. శివాజీ గణేశన్ గారికి తెలుగు వంటకాలు అంటే చాలా ఇష్టం. పక్క ఫ్లోర్ లో తెలుగు సినిమా షూటింగు జరుగుతుందని తెలిస్తే, ఆయన భోజనం కోసం వచ్చేసేవారు" అని అన్నారు.
'భూకైలాస్' సినిమాను ఒకేసారి తెలుగు .. కన్నడ భాషల్లో చిత్రీకరంచారు. రాజ్ కుమార్ గారు అక్కడే కూర్చుని, ఎన్టీఆర్ గారు ఎలా చేస్తున్నారా అనేది చూసేవారు. అలా ఒక ఆత్మీయ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఎవరికివారు వాళ్ల వ్యాన్స్ లో కూర్చుంటున్నారు. షాట్ కి పిలిస్తేనే బయటికి వస్తున్నారు" అని చెప్పారు.