అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు... వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత
- గత రెండ్రోజులుగా అమరావతిలో బీజేపీ నేతల సమావేశాలు
- హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్
- క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
- పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు
అమరావతిలో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహించారు.
125 మందికి పైగా నేతలతో శివప్రకాశ్ వరుసగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ బలాలపై సమీక్ష నిర్వహించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అన్నిటికంటే ముఖ్యంగా, పొత్తులపై ఈ సమావేశాల్లో చర్చించారు. రాష్ట్ర నేతలు పొత్తులపై తమ అభిప్రాయాలను శివప్రకాశ్ కు వివరించారు. పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన నేతలకు చెప్పారు.
రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల వివరాలను శివప్రకాశ్ బీజేపీ అధిష్ఠానానికి నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీలో బీజేపీ పొత్తులపై వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.