పవన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు!
- ఇవాళ పవన్ ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
- ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం జగన్ నుంచి ఆదేశాలు
- ఆరణి శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ వైసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు
తన నియోజకవర్గానికి మరొకరిని ఇన్చార్జిగా నియమించడంతో అసంతృప్తికి గురైన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవడం తెలిసిందే.
ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు నియోజకవర్గం ఇన్చార్జిగా విజయానందరెడ్డిని వైసీపీ అధినాయకత్వం ఇటీవలే నియమించింది. అప్పటినుంచే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది.