తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్... ఆ రెండు ఎంపీ స్థానాలపై సమీక్ష
- త్వరలో లోక్ సభ ఎన్నికలు
- కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాలపై సమీక్ష
- కరీంనగర్ నుంచి వినోద్ కుమార్... పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ కు చాన్స్!
- నియోజకవర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన కేసీఆర్
- ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు విచ్చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో... కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై వారితో చర్చించారు.
కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ను బరిలో దించాలని యోచిస్తున్న నేపథ్యంలో... రెండు నియోజకవర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమీక్షకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు, సంతోష్ కుమార్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్ తదితర నేతలు హాజరయ్యారు.
కాగా, మార్చి 12న కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభపైనా మాట్లాడారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ, సభ విజయవంతంపై కేసీఆర్ తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఈ సభ ద్వారా ఎలుగెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది.