బీజేపీకి రూ.2000 విరాళంగా ఇచ్చిన ప్రధాని మోదీ
- త్వరలో ఎన్నికలు
- విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
- వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి
- ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి
మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, అధికార బీజేపీ విరాళాలకు పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తనవంతు పార్టీ కోసం విరాళం అందించారు. నమో యాప్ ద్వారా రూ.2000 విరాళంగా ఇచ్చిన ఆయన అందుకు సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీకి సంతోషంగా విరాళం అందించాను అని వెల్లడించారు. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నమో యాప్ ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నానని మోదీ ట్వీట్ చేశారు.
ఈ మేరకు నమో యాప్ ఫండింగ్ పేజ్ లింకును కూడా పంచుకున్నారు. కాగా, నమో యాప్ ద్వారా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.2 వేల వరకు విరాళంగా ఇవ్వవచ్చు.