ఏడేళ్ల క్రితం అదృశ్యమైన మిషిగన్ మహిళ.. ఏడుపు విని గుర్తించి రక్షించిన పోలీసులు
- మిషిగన్‌లోని ఎవర్‌గ్రీన్ మోటెల్‌లో మహిళ ఏడుపు వినిపించడంతో పోలీసుల అనుమానం
- ఆ దిశగా వెళ్లగా కనిపించిన గది
- తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశం
- ఏడుస్తూ కనిపించిన మహిళ, పక్కనే డ్రగ్స్, తుపాకి
ఏడేళ్ల క్రితం అదృశ్యమైన అమెరికాలోని మిషిగన్‌కు చెందిన మహిళను ఆమె అరుపుల ద్వారా గుర్తించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం విషయాన్ని ఆమె పెంపుడు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇంక్‌స్టర్‌లోని ఓ మోటెల్ (మోటార్ హోటల్) నుంచి ఆమెను రక్షించినట్టు తెలిపారు. 2017లో ఆమె అదృశ్యమైందని, ఎవర్‌గ్రీన్ మోటెల్ నుంచి ఆమెను రక్షించినట్టు పేర్కొన్నారు.
తాము మోటెల్‌కు వెళ్లినప్పుడు ఓ చోటు నుంచి ఏడుపులాంటి శబ్దం సన్నగా వినిపించిందని, ఆ దిశగా వెళ్లగా ఓ గది కనిపించిందని మిషిగన్ పోలీసులు తెలిపారు. ఆ గదిని బలవంతంగా తెరిచి చూస్తే అందులో 30వ పడిలో ఉన్న ఓ మహిళ కనిపించిందని పేర్కొన్నారు. ఆమెపై భౌతికదాడి జరిగిన ఆనవాళ్లు లేవన్న పోలీసులు ఆమె చుట్టూ డ్రగ్స్, తుపాకి ఉన్నట్టు వివరించారు. వెంటనే ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆమెను కుటుంబానికి అప్పగిస్తారు. ఆమె అదృశ్యం వెనకున్న కారణాలు స్పష్టంగా తెలియరాకున్నప్పటికీ, ఆమె మానవ అక్రమ రవాణా ముఠా చేతికి చిక్కి ఉంటుందని డిటెక్టివ్‌లు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు.