మేం లేకుంటే ఇండియా గెలవదనుకునే వాళ్లు అక్కర్లేదు: సునీల్ గవాస్కర్

  • ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజయం చెబుతున్నదిదే
  • క్రికెట్.. ఓ బృందంగా ఆడాల్సిన ఆట
  • ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్న మాజీ కెప్టెన్
క్రికెట్ అనేది టీమ్ మొత్తం సమష్టిగా ఆడే ఆట అని, ఏ ఒక్కరిపైనో ఆధారపడదని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. నా వల్లే జట్టు గెలుస్తోంది, నేను లేకుంటే జట్టు లేదని భావించే వాళ్లు టీమ్ ఇండియాకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్, తాజాగా సొంతగడ్డపై జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇదే విషయం చెబుతున్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సీనియర్ ఆటగాళ్లు లేకున్నా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కొత్త కుర్రాళ్లు అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నారు. ఈ క్రెడిట్ మొత్తం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు చెందుతుందన్నారు. కాగా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో నలుగురు కుర్రాళ్లు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆరంగేట్ర మ్యాచ్ లోనే డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన యశస్వీ జైశ్వాల్ తో పాటు ఆకాశ్ దీప్, ధ్రువ్ జూరెల్, సర్ఫరాజ్ ఖాన్ లకు ఈ సిరీస్ లో చోటు దక్కింది.


More Telugu News