తెలంగాణకు ఐఐహెచ్‌టీను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
- తెలంగాణలో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేయాలని ఇదివరకే కోరిన రాష్ట్ర ప్రభుత్వం
- ఐఐహెచ్‌టీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి పలు కోర్సులు
- ఐఐహెచ్‌టీతో తెలంగాణ జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని మంజూరు చేసింది. తెలంగాణలో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఐఐహెచ్‌టీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐహెచ్‌టీతో తెలంగాణ జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.