కుమారుడి మాటలకు కదిలిపోయిన ముఖేశ్ అంబానీ... వీడియో ఇదిగో!
- రాధికా మర్చంట్ ను పెళ్లాడనున్న అనంత్ అంబానీ
- గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
- తన జీవితం పూల పాన్పు కాదన్న అనంత్ అంబానీ
- కంటతడి పెట్టుకున్న ముఖేశ్ అంబానీ
భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ జోడీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లో జామ్ నగర్ లో న భూతో న భవిష్యతి అన్న రీతిలో సాగుతున్నాయి. మూడ్రోజుల పాటు సాగనున్న ఈ ముందస్తు పెళ్లి వేడుకల్లో అంతర్జాతీయ పాప్ గాయని రిహాన్నా తన ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరైన ఈ వేడుకలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి.
కాగా, వేడుకల తొలి రోజున అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించగా, తనయుడి మాటలకు ముఖేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
"నా జీవితం పూల పాన్పు కాదని మీ అందరికీ తెలుసు. బాల్యం నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవిత ప్రస్థానంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ బాధను మర్చిపోయేలా చేసేందుకు నా తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నా లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారు.. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలను మరింత చిరస్మరణీయం చేసేందుకు మా ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచడానికి మా అమ్మ ఎంతో తపించిపోయారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ఓ తీపి గుర్తుగా మలచేందుకు మా కుటుంబం గత రెండు నెలలుగా రోజుకు 3 గంటలే నిద్రపోయింది" అని అనంత్ అంబానీ వివరించారు.
తనయుడి మాటలకు కదిలిపోయిన ముఖేశ్ అంబానీ ఓ దశలో కన్నీరు పెట్టుకున్నారు.