మంగళగిరిలో ఈ నెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు
- మంగళగిరిలో జయహో బీసీ సభ
- ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర
- ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి
మంగళగిరిలో మార్చి 5న మధ్యాహ్నం 3 గంటలకు జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జయహో సభ ద్వారా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ను ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ ను రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.
బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు.