గత పదేళ్లలో తెలంగాణ శాసన సభను సరిగ్గా నిర్వహించలేదు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- శాసన సభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకపోయేదని వ్యాఖ్య
- గత ప్రభుత్వం సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శ
- కానీ కొత్త ప్రభుత్వంలో శాసన సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతోందన్న స్పీకర్
గత పదేళ్ల కాలంలో తెలంగాణ శాసన సభను సరిగ్గా నిర్వహించలేదని, శాసన సభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకపోయేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీలో దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కానీ కొత్త ప్రభుత్వంలో శాసన సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతోందన్నారు.
శాసనసభలో జరిగే చర్చను కోట్లాదిమంది ప్రజలు చూస్తుంటారని, చిన్న పిల్లలు కూడా శాసన సభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారన్నారు. శ్రీపాదరావు గురించి మాట్లాడుతూ... ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉందన్నారు. శాసన సభ ఉన్నంత వరకు శ్రీపాదరావును స్మరించుకుంటారన్నారు.