భారత పర్యటనకు వచ్చిన స్పానిష్ మహిళపై ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారం

  • దుమ్కా మీదుగా బైక్‌పై భాగల్‌పూర్ బయలుదేరిన స్నానిష్ జంట
  • అర్ధరాత్రి 12 గంటల సమయంలో 10 మంది లైంగిక దాడి
  • ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఝార్ఖండ్‌లో దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. భారత పర్యటనకు వచ్చిన స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. హన్స్‌దిహా పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అయితే, అంతకుమించిన వివరాలను వెల్లడించలేదు.

మీడియా కథనాల ప్రకారం.. స్పానిష్ మహిళ తన భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. శుక్రవారం రాత్రి వారు బైక్‌పై దుమ్కా మీదుగా భాగల్‌పూర్ బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో హన్స్‌దిహా మార్కెట్ ముందు కుంజీ-కురుమహత్‌గా పిలిచే ప్రదేశంలో బైక్ ఆపారు. అదే సమయంలో 8 నుంచి 10 మంది అక్కడకు చేరుకుని దంపతులపై దాడిచేశారు. ఆపై మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


More Telugu News