అప్పుడు పోగొట్టుకున్న ఆ ఒక్క ఆస్తి విలువ ఇప్పుడు 100 కోట్లకి పైనే: జయసుధ
- సొంత సినిమాల వలన నష్టపోయామన్న జయసుధ
- ఆ బిల్డింగ్ అమ్మేయవలసి వచ్చిందని వెల్లడి
- బోర్ పడలేదని 9 ఎకరాలు అమ్మేశామని వ్యాఖ్య
- ఇప్పుడు దాని విలువ 100 కోట్లకి పైనేనని వివరణ
తెలుగు తెరపై కొన్ని దశాబ్దాల పాటు జయసుధ తన జోరును కొనసాగించారు. ఎన్టీఆర్ ... ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజుతో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నారు. అలాంటి జయసుధ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" నా అసలు పేరు సుజాత .. తమిళ దర్శక రచయిత గుహనాథన్ గారు నా పేరును జయసుధగా మార్చారు. 'జ్యోతి' సినిమాతో నా కెరియర్ దూసుకెళ్లింది. జయప్రద - శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య నేను నా ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగాను. వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో, నాకు అవార్డులు రావడం విశేషం. ఇక ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలనేది నా అభిప్రాయం. సొంత సినిమాల కారణంగా నష్టపోవడం జరిగింది" అని అన్నారు.
" చెన్నైలో ఒక ప్రాంతంలో స్థలం తీసుకుని పెద్ద బిల్డింగ్ కట్టాను. ఆ విషయం తెలిసి 'చాలా మంచి పనిచేశావ్' అని శోభన్ బాబుగారు కూడా అభినందించారు. కానీ ఆ తరువాత వచ్చిన స్లంప్ కారణంగా ఆ బిల్డింగ్ రెంట్ కి కూడా పోలేదు .. దాంతో అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడు అది ఇంకా బిజీ సెంటర్ అయింది. అలాగే ఇంకొక చోట 9 ఎకరాలు కొన్నాను. కానీ అక్కడి నేలలో బోర్ పడలేదని అమ్మేశాను. ఇప్పుడు దాని విలువ 100 కోట్లకి పైనే ఉంటుంది. ఆ స్థలానికి ఆనుకునే రజనీకాంత్ గారి ఫామ్ హౌస్ ఉంది" అని చెప్పారు.