ఊపందుకున్న కొనుగోళ్లు.. భారీగాపెరిగిన బంగారం ధరలు

  • 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 930 పెరుగుదల
  • హైదరాబాద్‌లో 24 కేరెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 64,090కి చేరిక
  • రూ. 500 పెరిగి రూ. 75 వేలకు చేరుకున్న వెండి
నిన్నమొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పెళ్లిళ్లు ప్రారంభం కానుండడంతో బంగారం, వెండి కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 కేరెట్లు) ధర రూ. 930 పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగి రూ. 75వేలకు చేరుకుంది.

పెరిగిన ధరతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 కేరెట్ల బంగారం ధర రూ. 64,090కి చేరింది. 22 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర 58,750కి పెరిగింది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,240 కాగా, 22 కేరెట్ల ధర రూ. 58,900గా ఉంది. చెన్నైలో వరుసగా రూ. 63,720, రూ. 59,400 కాగా, బెంగళూరులో రూ. 64,090, రూ.58,750గా నమోదయ్యాయి.


More Telugu News