నెట్ ఫ్లిక్స్ కి మలయాళం నుంచి మరో థ్రిల్లర్!
- టోవినో థామస్ హీరోగా 'అన్వేషిప్పిన్ కండేతుమ్'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
- ఫిబ్రవరి 9న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 8వ తేదీ నుంచి తెలుగులో అందుబాటులోకి
మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఎక్కువ సినిమాలు రూపొందుతూ ఉంటాయి. ఈ జోనర్ ను టచ్ చేస్తూ వారానికి ఒక సినిమా అయినా అక్కడి థియేటర్లకూ వస్తూనే ఉంటుంది. అలా ఫిబ్రవరి 9వ తేదీన 'అన్వేషిప్పిన్ కండేతుమ్' అనే సినిమా అక్కడ విడుదలైంది. టోవినో థామస్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది.
అక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాఫ్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
కాలేజ్ కి వెళ్లి అదృశ్యమైన ఓ అమ్మాయి కేసులో ఎస్. ఐ. ఆనంద్ నారాయణ్ సస్పెండ్ అవుతాడు. ఆ తరువాత కొంత కాలానికి ఒక పరువు హత్యకేసు అతని దగ్గరికి వస్తుంది. గతంలోని కేసుకు .. ఈ కేసుకు లింక్ ఉందనే విషయాన్ని గ్రహించిన ఆనంద్ నారాయణ్ ఏం చేస్తాడు? అనేదే ఈ సినిమా కథ. సిద్ధికీ .. ఆద్య ప్రసాద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.