లోక్‌సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ చేస్తున్నాడా?.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన మాజీ దిగ్గజం
- ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పిన మాజీ క్రికెటర్
- గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలను ఖండించిన యువీ
- ‘యూవీకెన్’ ద్వారా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని వెల్లడి
టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ లోక్‌సభ ఎన్నికలు-2024 బరిలో దిగుతున్నాడా?, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడా?. ఈ మేరకు జాతీయ మీడియాలో వెలువడుతున్న వార్తలు నిజమేనా?.. ఈ సందేహాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని యువరాజ్ సింగ్ ప్రకటించాడు. ఈ మేరకు మీడియాలో వెలువడుతున్న ప్రచారాన్ని ఖండించాడు. ‘‘మీడియా కథనాలను ఖండిస్తున్నాను. గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా స్థాయికి తగ్గట్టు ప్రజలకు సాయం చేయడమే నా అభిమతం. నా ఫౌండేషన్ ‘యూవీ కెన్’ ద్వారా ఈ సేవను కొనసాగిస్తాను. మార్పు తీసుకురావడం కోసం మన సామర్థ్యం మేరకు ప్రయత్నిద్దాం’’ అంటూ ఎక్స్ వేదికగా యువరాజ్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు.
కాగా యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయని మీడియాలో ప్రచారం జరిగింది. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడని కూడా చర్చ నడిచింది. గత నెలలో యువరాజ్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలవడం ఈ ప్రచారానికి గల కారణాల్లో ఒకటిగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రముఖ నటుడు సన్నీ డియోల్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టి యువీకి అవకాశం ఇవ్వబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా ఊహాజనితమేనని, తాను పోటీ చేయడం లేదని మాజీ క్రికెటర్ తేల్చిచెప్పాడు.