గాజాలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
- పాలస్తీనాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
- నిన్న గాజాలో మానవతా సాయం కోసం వేచి ఉన్న పౌరులపై ఇజ్రాయెల్ కాల్పులు
- 104 మంది మృతి... 280 మందికి గాయాలు
- ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్న భారత విదేశాంగ శాఖ
గాజాలో ఇజ్రాయెల్ నరమేధం మట్ల భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. సాయం కోసం వేచి ఉన్న అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపగా, 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 280 మంది గాయపడ్డారు.
ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మానవతా సాయం కింద నిత్యావసరాల పంపిణీ చేస్తుండగా, ఉత్తర గాజాలో చోటు చేసుకున్న కాల్పులు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. మానవతా సాయం అందించే కార్యక్రమాలు సకాలంలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ చేపట్టాలన్న తమ పిలుపును పునరుద్ఘాటిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.