పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు రూ.5.49 కోట్ల జరిమానా

  • ఇప్పటికే పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు
  • తాజాగా పేటీఎంపై జరిమానా వడ్డించిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 
  • మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనలు ఉల్లంఘించిన అంశంలో జరిమానా
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షల సుడిగుండంలో చిక్కుకున్న ప్రముఖ పేమెంట్స్ పోర్టల్ పేటీఎంపై కేంద్రం జరిమానా వడ్డించింది. మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నియమనిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. 

ఈ జరిమానాపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే బ్యాంకు ఖాతాల ద్వారా నేరపూరితంగా నిధులు మళ్లించినట్టు వివరించింది.

దీనిపై పేటీఎం ప్రతినిధి ఒకరు స్పందించారు. పేటీఎంకు సంబంధించి ఓ విభాగాన్ని రెండేళ్ల క్రితమే మూసివేశామని, దానికి సంబంధించిన అంశంలోనే తాజా జరిమానా విధించారని వివరించారు. ఈ విభాగానికి సంబంధించిన అన్ని వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు సమర్పించామని తెలిపారు.


More Telugu News