జనసేనకు గుడ్ బై... సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కుమారుడు
- వైసీపీ తీర్థం పుచ్చుకున్న చేగొండి సూర్యప్రకాశ్
- సూర్యప్రకాశ్ కు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్
- పార్టీలోకి సాదర ఆహ్వానం
- ఇప్పటివరకు జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాశ్
తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గ పెద్ద చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ నేడు వైసీపీలో చేరారు.
సూర్యప్రకాశ్ ఇప్పటివరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో, ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి నేడు వైసీపీ తీర్థం పుచుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో చేగొండి సూర్యప్రకాశ్ కు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.
టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ 24 అసెంబ్లీ సీట్లకు అంగీకరించడాన్ని సూర్యప్రకాశ్ తండ్రి హరిరామజోగయ్య తీవ్రంగా తప్పుబడుతున్నారు. పవన్ కు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.