20 ఏళ్ల తరువాత తిరిగొచ్చిన 'మన్మథుడు' హీరోయిన్ .. త్వరలో రీ ఎంట్రీ!
- 'మన్మథుడు'లో మెరిసిన అందాల 'అన్షు'
- కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ
- హఠాత్తుగా కనిపించకుండా పోయిన వైనం
- రీ ఎంట్రీ దిశగా వేస్తున్న అడుగులు
నాగార్జున కెరియర్లో 'మన్మథుడు' సినిమా ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన 'అన్షు' .. తన గ్లామర్ తో చాలా కాలం పాటు కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది. యూత్ అనుకున్నవారంతా ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు.
గులాబి రేకులాంటి మేని ఛాయతో .. ఆకర్షణీయమైన రూపంతో .. అమాయకత్వంతో కూడిన అభినయంతో అన్షు కట్టిపడేసింది. ఇక తెరపై ఆమె దూసుకుపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన ఆమె, ఆపై కనిపించలేదు. పెళ్లి చేసుకుని .. ఇంగ్లండ్ లోనే ఉంటున్న ఆమె, 20 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడికి తిరిగొచ్చారు.
రీసెంటుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 'అన్షు' మాట్లాడుతూ .. "ఇండస్ట్రీని వదిలేసిన 20 ఏళ్ల తరువాత వచ్చాను. ఎందుకు వదిలేశాను అని ఆలోచన చేసుకుంటే, చిన్నతనం కావడం వలన .. ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడం వలన .. చదువు పూర్తికాకపోవడం వలన అనే నాకు అనిపిస్తోంది. 'మన్మథుడు' సినిమా చేసే సమయానికి నాకు 16 ఏళ్లు మాత్రమే. ఆ సినిమా చేయడం నాకు ఇప్పటికీ ఒక కలగానే అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు.
'మన్మథుడు' తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత నేను ఇంగ్లండ్ వెళ్లిపోయాను. అప్పట్లో ఆ విషయం చాలామందికి తెలిసే అవకాశం కూడా లేదు. నేను చనిపోయానని కూడా అనుకున్నారట. అది తెలిసి నాకు భయం వేసింది కూడా. అప్పటికీ ఇప్పటికీ తెలుగు సినిమా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫ్లాట్ ఫామ్స్ వచ్చాయి కూడా. పిల్లలు కూడా పెద్దవాళ్లు కావడం వలన మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పారు.