ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ

  • అప్రూవర్ గా మారేందుకు రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్
  • ఈడీ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన వైనం
  • ఇదే కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు మాగుంట రాఘవకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, సీబీఐ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. ఇదే స్కామ్ లో ఇప్పటికే ఈడీ కేసులో రాఘవ అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ ఇద్దరూ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ లో రాఘవ కీలక పాత్రధారిగా ఉన్నారని ఈడీ పేర్కొంది. 

మరోవైపు ఇదే కేసులో విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ గ్రూపులో కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భాగస్వాములుగా ఉన్నారని ఈడీ చెపుతోంది.


More Telugu News