హైదరాబాదులో వాయుసేన విమానానికి తప్పిన ప్రమాదం
- వాయుసేన శిక్షణ విమానంలో సాంకేతికలోపం
- తెరుచుకోని హైడ్రాలిక్ వింగ్స్
- 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
- ఎట్టకేలకు బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- విమానంలోని మొత్తం 12 మందీ సురక్షితం
భారత వాయుసేనకు చెందిన విమానాలు కొన్ని దశాబ్దాలుగా ప్రమాదాలకు గురికావడం తెలిసిందే. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇవాళ హైదరాబాదులో వాయుసేనకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన శిక్షణ విమానం కిందికి దిగే సమయంలో హైడ్రాలిక్ వింగ్స్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానం 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో పైలెట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా ఉండడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.