ప్రత్తిపాటి కుమారుడి అరెస్ట్ పై గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు

  • టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు
  • అణచివేతకు పాల్పడుతున్నారని వెల్లడి
  • ఏపీఎస్డీఆర్ఐని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపణ  
టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ అరెస్ట్ విషయాన్ని తన లేఖలో ఆయన వివరించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పైనా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. అణచివేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 

విపక్షాలను వేధించేందుకు ఏపీఎస్డీఆర్ఐని అస్త్రంగా వాడుకుంటున్నారని, విధేయుడైన వ్యక్తిని స్పెషల్ కమిషనర్ గా నియమించుకుని వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.


More Telugu News