నేటి నుంచి అమల్లోకి గృహజ్యోతి పథకం.. జీరో బిల్లులు జారీచేస్తున్న విద్యుత్ సిబ్బంది

  • జీరో బిల్లు కోసం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసిన ప్రభుత్వం
  • అన్ని సెక్షన్లలోనూ జారీ చేస్తున్న సిబ్బంది
  • అన్ని అర్హతలు ఉన్నా జీరో బిల్లు రాకుంటే మున్సిపల్, మండల కార్యాలయాల్లో మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకంలో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌‌లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉండి కూడా జీరో విద్యుత్ బిల్లు రాకుంటే దగ్గర్లో ఉన్న మున్సిపల్, మండల కార్యాలయాలకు వెళ్లి మరోమారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా తెల్ల రేషన్‌కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్‌కార్డ్, విద్యుత్ కనెక్షన్ నంబర్‌ను సమర్పించాలి. కాగా, ఈ పథకానికి ఇప్పటి వరకు 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో రేషన్ కార్డులు ఉన్న వారి సంఖ్య 64 లక్షలు మాత్రమే. వీరిలో 34,59,585 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా తేల్చింది.


More Telugu News