ప్రత్తిపాటి శరత్ ఆచూకీ చెప్పాలంటూ డీసీపీ శ్రీనివాసరావును కలిసిన టీడీపీ నేతలు

  • ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • శరత్ పై పన్ను ఎగవేత ఆరోపణలు
  • పలు సెక్షన్ల కింద ఏడుగురిపై కేసు నమోదు
టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు నేడు విజయవాడ డీసీపీ శ్రీనివాసరావును కలిశారు. ప్రత్తిపాటి శరత్ ఆచూకీ చెప్పాలని డీసీపీని కోరారు.

టీడీపీ నేత పట్టాభిరామ్ మాట్లాడుతూ, శరత్ ను పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారని, శరత్ అలెక్సా కంపెనీలో అదనపు డైరెక్టర్ గా 3 నెలలే పనిచేశారని పట్టాభి వివరించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో జగన్  పెట్టిన కేసు అని ఆరోపించారు. 

కాగా, డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు శరత్ పై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి శరత్ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. అందులో ఆయన భార్య, బావమరిది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

నిధులు మళ్లించి పన్ను ఎగవేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయనపై ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


More Telugu News