ప్రత్తిపాటి శరత్ ఎక్కడున్నాడో ప్రభుత్వం చెప్పాలి: పట్టాభిరామ్
- ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్
- అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు
- తండ్రిని రాజకీయంగా ఎదుర్కొనలేక కుమారుడిపై కేసు పెట్టారన్న పట్టాభి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ ఎగవేత కేసులో విజయవాడ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ టీడీపీ నేతలు ముక్తకంఠంతో శరత్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఈ అంశంపై స్పందించారు. శరత్ కు ప్రాణహాని ఉందని భావిస్తున్నామని, అతడి ఆచూకీ చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలు, కుటుంబాలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక, తప్పుడు కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు.
ప్రత్తిపాటి శరత్ పై అక్రమ కేసు పెట్టారని, టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాలో పుల్లారావు పేరు రాగానే కేసు పెట్టారని ఆరోపించారు. తండ్రిని రాజకీయంగా ఎదుర్కొనలేక, కుమారుడిపై కేసు పెట్టారని పట్టాభి వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు.