అల్లు అర్జున్ మా ఊరు వస్తే ఆ కోలాహలం మామూలుగా ఉండదు: మామ చంద్రశేఖర్ రెడ్డి
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన అల్లు అర్జున్ మామ
- అర్జున్ మా ఊరు వస్తే ఆయన్ను చూసేందుకు ఎక్కడెక్కడ్నించో జనాలు వస్తారని వెల్లడి
- అందుకే ఎవరికీ చెప్పకుండా ఊరికి తీసుకువస్తామని వివరణ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తమ ఊరికి వస్తే భారీ కోలాహలం నెలకొంటుందని తెలిపారు.
సాధారణంగా అల్లు అర్జున్ తమ ఊరికి వచ్చేటప్పుడు ఎవరికీ చెప్పకుండా ఆయనను తీసుకువస్తామని, కానీ ఆయన వచ్చిన కొన్ని నిమిషాల్లో ఆ విషయం అంతా పాకిపోతుందని అన్నారు. అల్లు అర్జున్ వచ్చాడని తెలిస్తే 60, 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ఆయనను చూసేందుకు తమ గ్రామానికి వస్తారని వివరించారు.
అర్జున్ వస్తున్నాడని చెబితే రోడ్లు కూడా బ్లాక్ అయ్యేంత జనం వస్తారని, అందుకే ముందుగా ఎవరికీ చెప్పమని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
ఇక, తన అల్లుడు నటించే చిత్రాల షూటింగులకు తాను వెళ్లడం తక్కువేనని, కానీ ఓసారి పుష్ప షూటింగుకు వెళ్లానని వివరించారు. పుష్ప-2 షూటింగుకు కూడా రమ్మని పిలిచారని, త్వరలోనే వెళతానని చెప్పారు. సినిమా జీవితంలోనూ కష్టం ఉంటుందని, ఆ లైటింగ్, ఎండ, వాన, చలి ఇలా అన్ని పరిస్థితులను తట్టుకోవాల్సి ఉందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని, అందుకే తన పిల్లలు స్నేహారెడ్డి, లక్ష్మీరెడ్డిల చదువుకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చానని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో వారి స్కూలుకు దగ్గర్లోనే ఇల్లు తీసుకుని ఉన్నామని గుర్తుచేసుకున్నారు.