ఉత్కంఠను రేపుతున్న 'గామి' ట్రైలర్!

  • విష్వక్ ఇమేజ్ కి భిన్నంగా రూపొందిన 'గామి'
  • అఘోరగా కనిపించనున్న విష్వక్ 
  • హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుకున్న సినిమా 
  • మార్చి 8వ తేదీన విడుదల

విష్వక్ సేన్ ప్రధానమైన పాత్రగా 'గామి' సినిమా రూపొందింది. కార్తీక్ శబరీశ్ - శ్వేత నిర్మించిన ఈ సినిమాతో, విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్  ను నిర్వహించారు. సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

హీరో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అతను ఆ సమస్య నుంచి బయట పడటానికీ, 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధం ఉంటుంది. ఆ పనిపైనే అక్కడికి కథానాయకుడు బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనేదే కథ. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ సినిమాలో విష్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా కాశీలోను .. హిమాలయాల్లోను చిత్రీకరణ జరుపుకుంది. కీలకమైన పాత్రలలో చాందినీ చౌదరి - అభినయ కనిపించనున్నారు. నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.



More Telugu News