పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే ఆ పాత్ర ఒక్కటే సరిపోతుంది: పేర్ని నాని

  • తాడేపల్లిగూడెం సభలో తనను తాను వామనుడితో పోల్చుకున్న పవన్
  • పవన్ వామనుడు కాదు శల్యుడు అన్న పేర్ని నాని
  • శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని పవన్ పై విమర్శలు
  • నిన్నటి సభలో అన్నీ సొల్లు మాటలు చెప్పారని ఎద్దేవా
తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కల్యాణ్ ను పోల్చారు. పపన్ కల్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకుంటున్నాడని, కానీ ఆయనను ఎవరితోనైనా పోల్చాలంటే పురాణాల్లో శల్యుడి పాత్ర ఒక్కటే సరిపోతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. శల్యుడి తరహాలోనే పవన్ పార్టీని, పార్టీ నేతలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాడని పేర్ని నాని ఆరోపించారు. 

కనీసం చంద్రబాబు నిన్నటి సభలో పవన్ ను పొగుడుతూ ఒక్క మాట కూడా చెప్పలేదని, కానీ పవన్ మాత్రం చంద్రబాబు కోసం నాలుక మడతేశాడని పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ చెప్పినవన్నీ సొల్లు మాటలేనని అన్నారు. చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ కల్యాణ్ పని అని వ్యాఖ్యానించారు. నిన్నటి సభలో పవన్ సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టునే చదివారని, సినిమా డైలాగులు బట్టీ కొట్టి వచ్చారని పేర్ని నాని విమర్శించారు. 

నువ్వు 24 తీసుకుంటావో, 4 తీసుకుంటావో, లేక 2 సీట్లు తీసుకుంటావో... మాకెందుకు బాధ? జగన్ వద్ద బేరాలు ఉండవమ్మా... పవన్ కల్యాణ్ కు చేతనైంది చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గురించి టన్నుల కొద్దీ సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.


More Telugu News