టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్
- జీఎస్టీ ఎగవేశారంటూ ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ పై ఆరోపణలు
- మాచవరం పీఎస్ లో కేసు నమోదు
- గతంలోనూ శరత్ కు చెందిన కంపెనీపై ఐటీ దాడులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాచవరం పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు నేడు ప్రత్తిపాటి శరత్ ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఎన్నికల వేళ ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రత్తిపాటి శరత్ ను వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు చెందిన అవెక్సా కంపెనీపై 2020లో ఐటీ దాడులు జరగడం తెలిసిందే. శరత్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు.