టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో భేటీ
- మార్చి 2న టీడీపీలో చేరతానని వెల్లడి
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబును పలుమార్లు కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
తాను టీడీపీలో ఎప్పుడు చేరేదీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మార్చి 2న దాచేపల్లిలో జరగబోయే 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని వివరించారు. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని తెలిపారు. నన్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు.
వైసీపీ అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను బదిలీ చేస్తుండడం తెలిసిందే. నరసరావుపేట నియోజకవర్గంపై వైసీపీ హైకమాండ్ నుంచి భరోసా లేకపోవడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. కాగా, నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ ప్రకటించింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు.