మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం... నకిలీ కరెన్సీ గుర్తింపు

  • అంబేడ్కర్ బొమ్మతో రూ.100 నకిలీ నోట్ల గుర్తింపు
  • హుండీల లెక్కింపుకు సీసీ కెమెరాలతో భారీ భద్రత
  • పది రోజుల పాటు మొత్తం 518 హుండీల లెక్కింపు
మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 518 హుండీలను పదిరోజుల పాటు లెక్కించనున్నారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగుతోంది. సమ్మక్క సారలమ్మలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారం, నగదును సమర్పించుకున్నారు.

అయితే హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఈ నకిలీ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రం ఉంది. గురువారం మధ్యాహ్నం తెరిచిన ఓ హుండీలో అంబేడ్కర్ ఫొటోతో నకిలీ రూ.100 నోట్లు కనిపించాయి. లెక్కింపు కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు లెక్కించిన మొత్తాన్ని ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈసారి  ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News