ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • మార్చి 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని
  • 4న ఆదిలాబాద్‌లో, 5న సంగారెడ్డిలో కార్యక్రమాలు
  • పలు అభివృద్ధి పనుల ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయనున్న నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభంతో పాటు, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగసభలలో కూడా ఆయన పాల్గొననున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌‌కు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం బయలుదేరి తమిళనాడు వెళ్తారు. తిరిగి అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు వస్తారు. ఆ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.

ఇక 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 5న ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి సంగారెడ్డికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కార్యక్రమాలను ముగించుకుని ఒడిశా రాష్ట్రానికి వెళ్తారు.


More Telugu News