డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- రేపు లేదా ఎల్లుండి కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం
- ఇప్పుడున్న 5,089 పోస్టులకు తోడు మరిన్ని పోస్టులు
- క్రితంసారి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. రేపు లేదా ఎల్లుండి కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడున్న 5,089 పోస్టులకు తోడు మరిన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పేరిట ప్రెస్ నోట్ విడుదల అయింది.
06-09-2023న డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని, కానీ ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రెస్ నోట్‌లో పేర్కొంది. తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపింది. ఇక్కడ మరో కీలకమైన విషయం కూడా పేర్కొంది. క్రితంసారి దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని... వారి దరఖాస్తులు ఆటోమేటిక్‌గా క్యారీ ఫార్వార్డ్ అవుతాయని తెలిపింది.