క్లేమోర్ మైన్లు పేలినా చలించని దురంధరుడు చంద్రబాబు: పవన్ కల్యాణ్
- తాడేపల్లిగూడెం సభలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్
- చంద్రబాబును కీర్తించిన జనసేనాని
- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని స్పష్టీకరణ
క్లేమోర్ మైన్లు పేలినా, పేలుడు ధాటికి వాహనం 16 అడుగుల ఎత్తుకు ఎగిసి కిందపడినా... చొక్కా దులుపుకుని ఇవతలికి వచ్చేసిన దురంధరుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కల్యాణ్ కీర్తించారు. ఇప్పుడు తాము అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు.
తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడి సభలో పవన్ ప్రసంగిస్తూ... చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవ నగర నిర్మాణం చేయగలరని వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
"నా తపన మీరు బాగుండాలనే... అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్ మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చింది" అని పవన్ కల్యాణ్ వివరించారు.
నన్ను నమ్మండి... వ్యూహం నాకు వదిలేయండి... నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నడుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, యువత... నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందాం... ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు.