తెలంగాణలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

  • హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్ నియామకం  
  • ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, అదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్నిషా, మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బదిలీ
  • జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బీ.హెచ్.సహదేవ్ రావు నియామకం
తెలంగాణలో అయిదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను నియమించింది. ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, అదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్నిషా, మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బీ.హెచ్.సహదేవ్ రావును నియమించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. అయిదు జిల్లాలకు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా పర్సా రాంబాబు, హన్మకొండ అదనపు కలెక్టర్‌గా ఎ.వెంకట్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డీ.వేణుగోపాల్ బదిలీ అయ్యారు.


More Telugu News