విజయశాంతిగారితో పదేళ్లు మాటల్లేవ్: సీనియర్ హీరో సురేశ్

  • 340కి పైగా సినిమాలు చేసిన సురేశ్
  • 'రోజా' సినిమా తాను చేయవలసిందని వెల్లడి 
  • సౌందర్య మరణం పట్ల ఆవేదన
  • విజయశాంతితో గొడవ గుర్తులేదని వ్యాఖ్య
హీరోగా .. విలన్ గా ... కేరక్టర్ ఆర్టిస్టుగా సురేశ్ అనేక సినిమాలు చేశారు. 340కి పైగా సినిమాలు చేసిన ఆయన, తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " అప్పట్లో నేను హీరోయిన్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. అందువలన ప్లే బాయ్ అనే ప్రచారం జరిగింది. 'రోజా' సినిమాలో నేను చేయవలసింది .. కానీ చేయలేకపోయాను. అందుకే నేను కర్మ సిద్థాంతాన్ని నమ్ముతాను" అన్నారు. 

'అమ్మోరు' సినిమా సమయానికి సౌందర్యది చాలా చిన్న వయసు. చాలా ఫాస్టుగా తాను స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమెతో మళ్లీ నేను 'దేవీపుత్రుడు' చేశాను. 'అమ్మోరు' సమయంలో ఆమె ఎలా ఉన్నారో .. స్టార్ డమ్ వచ్చాక కూడా అలాగే ఉన్నారు. పరిస్థితులు .. పారితోషికాలు మారినా, తాను మాత్రం మారలేదు. ముచ్చటైన ఆమె నవ్వు ఎవరికైనా అలా గుర్తుండిపోతుంది. ఇంతవరకూ నేను కన్నీళ్లు పెట్టుకుంది రెండుసార్లే. ఒకటి శ్రీహరి పోయినప్పుడు .. రెండోది సౌందర్య పోయినప్పుడు" అని చెప్పారు. 

ఇక విజయశాంతిగారు, నేను పదేళ్లు మాట్లాడుకోలేదు. మా ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందనేది నాకు నిజంగా గుర్తులేదు. ఆ తరువాత కూడా మేం తెలుగు .. తమిళ సినిమాలు కలిసి చేశాము. పదేళ్ల తరువాత ఆమె .. నేను 'ఊటీ'లో కలుసుకున్నాం. ఆమె వేరే షూటింగులో ఉన్నారు .. నేను వేరే షూటింగులో ఉన్నాను. అప్పుడు మాత్రం పలకరించుకున్నాం .. అంతే. ఆ తరువాత ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యారు" అన్నారు. 


More Telugu News